హిందీని వ్యతిరేకించడం సరైంది కాదు : వెంకయ్య

హిందీ భాషను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదని.. అలాగని ఏ భాషనూ ఎవరిపైనా రుద్దాల్సిన అవసరం లేదని అన్నారు ఉపరాష్ట్రపతి  వెంకయ్యనాయుడు.  ఏ భాషనైనా వ్యతిరేకించడం  సరికాదని అన్నారు. వివిధ భాషలు, వివిధ ఆచారాలున్నా భారతదేశమంతా ఒక్కటేనని, భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ విశిష్టతని తెలిపారు. హిందీ దివస్‌ సందర్భంగా మధుబన్‌ విద్యాసంబంధ ప్రచురణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్‌ లైన్‌ సమావేశంలో వెంకయ్యనాయుడు మాట్లాడారు. ఎవరి మాతృభాషను వారు నేర్చుకుంటూనే… మరో భారతీయ భాషను కూడా నేర్చుకోవాలని సూచించారు.

Latest Updates