చెట్టు కింద ఆఫీసర్!

ఇగో పైనున్న తస్వీర్‌ల చెట్టు కనిపిస్తంది కదా.. నీడ కోసం అక్కడ ఆగిన్రని భ్రమపడేరు.. అదిగాదు ముచ్చట. అందులో ఒక సారు ఉన్నడు.. ఫైళ్లు తెప్పించుకుని చూస్తుండు.. గిట్ల ఎందుకు చేస్తుండని అనుకుంటున్నరా?? అగో బీఆర్కే భవన్ల రిపేర్లు ఇంకా కాలేదంట.. ఆర్నెల్లయినా గంతేనంట.. దుమ్ము ధూళితోని దమ్మొస్తందంట.. అక్కడ డ్యూటీ చేయలేక పాత సెక్రటేరియెట్​ కాడికి వోయి ఫైళ్లు క్లియర్ జేస్తుండు. గిట్ల చెట్టు కింద ఆఫీసర్ అయిండు! గింతకీ గా సారు ఎవరనుకున్నరు? ఐటీ డిపార్ట్‌మెంట్​లో జాయింట్ డైరెక్టరు షేక్ ముస్తాఫా.

Latest Updates