నయీం కుటుంబ సభ్యులకు ఐటీ నోటీసులు

గ్యాంగ్‌స్టర్ నయీం కుటుంబసభ్యులకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఇవాళ(మంగళవారం) భువనగిరిలోని నయీం ఇంటికి ఐటీ అధికారులు నోటీసులు అంటించారు. నయీం తల్లి తహేరాబేగం, సోదరి సలీమా, భార్య హసీనా బేగం, అతని అనుచరుడు పాశం శ్రీనివాస్ పేరుతో నోటీసులు జారీ అయ్యాయి.

గతేడాది చివరిలో గ్యాంగ్ స్టర్ నయీం ఆస్తుల విలువకు సంబంధించి ఏర్పాటు చేసిన సిట్ కీలక ప్రకటన చేసింది. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో  నయీం హతమైన తర్వాత ఆయన ఆస్తులపై విచారణ జరిపిన సిట్‌ అతనికి రూ. 2 వేల కోట్ల విలువైన ఆస్తులున్నాయని తెలిపింది. మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, గోవా, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో ఈ ఆస్తున్నాయని చెప్పింది.1,015 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు అధికారులు. లక్షా 67 వేల 117 చదరపు అడుగుల ఇళ్ల స్థలాలున్నాయని, మొత్తం 29 భవనాలు ఉన్నాయని సిట్ తెలిపింది. 1.90 కిలోల బంగారు నగలు, రూ. 2.8 కోట్ల నగదు తో పాటు 258 సెల్ ఫోన్లు, ఖరీదైన కార్లు, ద్విచక్ర వాహనాలున్నాయని, వెపన్స్ ఉన్నాయని సిట్ అధికారులు తెలిపారు.

Latest Updates