ఐటీ రిటర్న్ దాఖలుకు గడువు పొడగింపు

కరోనా దృష్ట్యా ఐటీ రిటర్న్స్ పై కీలక నిర్ణయం  తీసుకుంది కేంద్ర ఆర్థిక శాఖ. 2018-19 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్న్‌ల దాఖలుకు 2020, జూన్‌ 30 వరకు గడువు విధించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి  నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఈ వ్యవధిలో పన్ను చెల్లింపుల ఆలస్య రుసుము 12 నుంచి 9 శాతానికి తగ్గించినట్లు తెలిపారు. ఆధార్‌ – పాన్‌ అనుసంధానం గడువును కూడా జూన్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

టీడీఎస్‌ జమలో ఆలస్య రుసుము 18 నుంచి 9 శాతానికి తగ్గించారు. రూ. 5 కోట్ల టర్నోవర్‌ పైబడిన పెద్ద కంపెనీలకు పన్ను చెల్లింపులపై వడ్డీ, అపరాధ రుసుం 9 శాతానికి తగ్గిస్తున్నట్లు చెప్పారు. అలాగే వివాద్‌ సే విశ్వాస్‌ పథకం గడువు జూన్‌ 30వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు కేంద్రమంత్రి నిర్మలా.

Latest Updates