హీరో విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు

కోలీవుడ్ హీరో విజయ్‌కి ఐటీ అధికారులు షాకిచ్చారు. హీరో విజయ్‌కి చెందిన ఇళ్లు, బిగిల్ సినిమా నిర్మాణ సంస్థ ఏజీఎస్ కార్యాలయాలతో పాటు.. ఆ సినిమా ఫైనాన్షియర్ అన్బుచెలియన్ ఇంట్లో ఐటీ దాడులు జరిగాయి. బుధవారం నుంచి జరుగుతున్న ఐటీ దాడులు.. ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. హీరో విజయ్ ఇంట్లో రూ. 24 కోట్ల విలువైన బంగారం, నగదు లభించింది. ఇదంతా లెక్కతేలలేదని తెలుస్తోంది. ప్రస్తుతం హీరో విజయ్ ఓ సినిమా షూటింగ్‌లో ఉన్నారు. ఆయనను ఐటీ అధికారులు అక్కడే విచారించారు. విజయ్ హీరోగా నటించిన బిగిల్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా 250 నుంచి 300 కోట్ల వరకు వసూల్ చేసిందని ఇండస్ట్రీ టాక్. ఈ సినిమా కోసం విజయ్ రూ. 50 కోట్లు పారితోషికంగా తీసుకున్నారట. దాదాపు ఏడు గంటలుగా హీరో విజయ్‌ను ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Latest Updates