ఆ కన్నీటి వీడ్కోలుకు ఆరేళ్లు…

క్రికెట్ గాడ్ గా పిలుచుకునే సచిన్ టెండుల్కర్.. బహుశా క్రికెట్లో ఈ పేరు తెలియని వాళ్లుండరు కావొచ్చు.. రెండు దశాబ్దాలకు పైగా అంతర్జాతీయ క్రికెట్ ఆడి ఎన్నో రికార్డులు సృష్టించి క్రికెట్ కే వన్నె తెచ్చిన సచిన్ కు.. సరిగ్గా ఆరేళ్ల క్రితం ఇదే రోజు అంటే నవంబర్ 16, 2013 మరిచి పోలేని రోజు. ఎందుకంటే సచిన్  వాంఖడే స్టేడియంలో చివరి  ఇంటర్నేషనల్ టెస్టు మ్యాచ్ ఆడి క్రికెట్ కు గుడ్ బై చెప్పిన రోజు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సచిన్ .. స్టేడియంలో కన్నీళ్లతో  వీడ్కోలు పలికాడు.  అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సచిన్ ప్రస్తుతం ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు మెంటర్ గా ఉన్నాడు.

16 ఏళ్ల వయసులో 1989లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టిన సచిన్  2013 వరకు అంటే దాదాపు 24 సంవత్సరాల పాటు అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగాడు. అన్ని ఫార్మాట్లలో 34,357 పరుగులతో క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా అవతరించాడు. అంతేగాకుండా వన్డేల్లో 49 టెస్టుల్లో 51 సెంచరీలతో మొత్తం 100 సెంచరీలు చేసి రికార్డును సృష్టించాడు.

Latest Updates