కేరళ చాలా సేఫ్‌

  • కరోనా నుంచి కోలుకున్న
  • ఇటాలియన్‌ కితాబు

తిరువనంతపురం: కేరళ దేవభూమిగా పేరొందిన రాష్ట్రం. పచ్చదనంతో ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉండే ఆ రాష్ట్రం చాలా సేఫ్‌ అని కరోనా నుంచి కోలుకున్న ఇటాలియన్‌ టూరిస్ట్‌ ఒకరు కితాబు ఇచ్చారు. తనకు ట్రీట్‌మెంట్‌ చేసిన డాక్టర్లకు థ్యాంక్స్‌ చెప్పారు. ఇటలీ నుంచి వచ్చిన రోబెర్టో టోనిజ్జో అనే వ్యక్తికి మార్చి 13న కరోనా పాజిటివ్‌ రావడంతో జనరల్‌ హాస్పిటల్‌లో ఉంచి ట్రీట్‌మెంట్‌ చేశారు. ఆ తర్వాత రెండు సార్లు ఆమెకు రిజల్ట్‌ నెగటివ్‌ రావడంతో క్వారంటైన్‌ ఉంచారు. పూర్తిగా రిక్వరీ అయిన తర్వాత సోమవారం హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ చేశారు. “ నాకు ట్రీట్‌మెంట్‌ చేసిన డాక్టర్లకు చాలా థ్యాంక్స్‌. కేరళ నాకు సొంత ఇళ్లు లాంటిది. నేను మళ్లీ కచ్చితంగా కేరళకు తిరిగి వస్తాను. ఇక్కడ అందరూ చాలా బాగా కష్టపడుతున్నారు” అని ఆయన అన్నారు. అతనితో పాటు వచ్చిన మిగతా వారంతా బెంగళూరులో ఉండటంతో అధికారులు ప్రత్యేక వాహనంలో బెంగళూరు పంపించారు. మన దేశంలో మొదటి కరోనా కేసు నమోదైంది కేరళలోనే. వైరస్‌ను అరికట్టేందుకు ఆ రాష్ట్రం అన్ని చర్యలు తీసుకోవడంతో ఇప్పుడు అక్కడ కేసుల సంఖ్య తగ్గింది.

Latest Updates