ఈ ఊర్లో ఇండ్లన్నీ ఫ్రీ.. ఫ్రీ

  • ఇటలీలోని కమరట టౌన్‌ ఆఫర్‌
  • కొన్ని పట్టణాల్లో ఒక్క డాలర్‌ కే      
  • ఖాళీ అవుతున్న పట్టణాలను కాపాడుకోవడానికి

ఇటలీలోని కొన్ని పట్టణాల్లో కొన్నేళ్లుగా జస్ట్‌‌ ఒక్క డాలర్‌‌కే ఇండ్లమ్ముతున్నారు. ఇండ్లను మరమ్మతు చేసుకోకుండా టౌన్ల నుంచి ఖాళీ చేసి పోతున్న జనాన్ని ఆకర్షించేందుకు, పట్టణాలను కాపాడేందుకు అక్కడి లోకల్‌‌ గవర్నమెంట్లు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. ఈ లిస్టులో ఇప్పుడు నేపుల్స్‌‌లోని జుంగోలి, సిసిలీలోని సంబుక చేరాయి. ఈమధ్యే  బిడ్డింగ్‌‌ స్కీమ్‌‌ను స్టార్ట్‌‌ చేశాయి. సిసిలీలోని ఇంకో టౌన్‌‌ కమరటనైతే మరో మెట్టు పైకెక్కి ఫ్రీగా ఇండ్లిస్తోంది. నగరాన్ని కాపాడుకునేందుకు ఆ నగర మేయర్‌‌ కూడా రంగంలోకి దిగారు. జనాన్ని ఒప్పించేందుకు తనకు తోచిన రీతిలో ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు వెలుగు వెలిగిన నగరం ఇప్పుడు బోసిపోయి కనిపిస్తుండటం చూడలేకపోతున్నానని అంటున్నారు. కమరటలో ఫ్రీగా ఇండ్లిస్తున్నా కొన్ని కండీషన్లు కూడా ఉన్నాయి. కొన్న ప్రాపర్టీని మూడేళ్లలో రెనొవేట్‌‌ చేసుకోవాలని, దానికి సంబంధించి ప్రతిపాదన కూడా పంపించాలని నిబంధన ఉంది. అలాగే రూ. 3 లక్షల డిపాజిట్‌‌ కూడా కట్టాలని రూల్‌‌ ఉంది. ప్రాపర్టీని రెనొవేట్‌‌ చేసుకున్నాక డబ్బు తిరిగిస్తారు. పిల్లలున్న యంగ్‌‌ కపుల్‌‌కు బిడ్‌‌లో ప్రాధాన్యమిస్తారు. సిటీకొచ్చాక పిల్లలు పుడితే రూ.78 వేల బోనస్‌‌ కూడా ఇస్తారు. మల్టీ స్టోరీ బిల్డింగ్‌‌లను కొత్త ఓనర్లు హోటళ్లు, షాపులు, రెస్టారెంట్లుగా మార్చుకునే వెసులుబాటిచ్చారు.

పక్క టౌన్‌‌తో లొల్లి

కమరట జనాలు కొత్తవాళ్లను, బయటి వాళ్లను ఆప్యాయంగా ఆదరించినప్పటికీ పక్క పట్టణాల ప్రజలతో మాత్రం గొడవలున్నాయి. కమరటకు ఆనుకొని సాన్‌‌ గియోవన్ని జెమిని పట్టణముంది. ఈమధ్య ఏర్పాటైన టౌన్‌‌. ఇక్కడో రోడ్‌‌కు రెండు పేర్లున్నాయి. మనం నిలబడ్డ ప్రదేశం బట్టి పేరు మారుతుంది. యాక్సిడెంటల్‌‌గా కొన్ని ఇండ్లు బార్డర్‌‌ దాటి కట్టారు. దీంతో ఇంటి కిచెన్‌‌ కమరటలో, సాన్‌‌ గియోవన్నీలో లివింగ్‌‌ రూమ్‌‌ ఉండిపోయాయి. గతంలో 2 పట్టణాలను కలపాలా అని ఓటింగ్‌‌ పెడితే వద్దని ప్రజలు తేల్చేశారు.

వందేళ్లు బతుకుతరు

కమరట ఓ అద్భుతమైన ప్రదేశమని అక్కడి టూరిస్టు గైడ్‌‌ ఎన్జో లి గ్రేంగి అంటున్నారు. పట్టణమంతా ఎర్రని రాళ్లు, పెద్ద పెద్ద బాల్కనీలున్న ఇండ్లతో అద్భుతంగా కనిపిస్తుంటుందని వివరించారు. ‘టౌన్‌‌ విత్‌‌ 1,000 బాల్కనీస్‌‌ టు ది ఈస్ట్‌‌’గా మంచి పేరుందన్నారు. ఇండ్ల బాల్కనీలోకెక్కి మౌట్‌‌ ఎట్నా అగ్నిపర్వతాన్ని చూస్తూ ఎంజాయ్‌‌ చేయొచ్చంటున్నారు. పర్వతం బద్దలైనప్పుడు లావాను చూస్తే ఆ థ్రిల్లే వేరంటున్నారు. ఇక్కడుండే వాళ్లు వందేళ్లకు పైబడి బతుకుతుంటారని, ఏటా నలుగురైదుగురి వందో పుట్టినరోజులు జరుగుతాయని అన్నారు. ఇక్కడి వాతావరణమే దీనికి కారణమని చెప్పారు.  జనం రాకుంటే వీకెండ్స్​లోనైనా ఇక్కడ ఎంజాయ్‌‌ చేస్తానన్నారు. 

Latest Updates