కరోనా మృతుల్లో చైనాను దాటిన ఇటలీ

కరోనా వైరస్ మొదటగా చైనాలో పుట్టి.. ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. అక్కడ 80 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారిన పడి 3,248 మంది చనిపోయారు.

చైనా నుంచి వైరస్ దాదాపు 180 దేశాలకు విస్తరించింది. అందులో ఇటలీపై ఈ కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇటలీలో 41,035 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 3,405 మంది మరణించారు. అంటే చైనాలో చనిపోయిన వారి సంఖ్యను ఇటలీ దాటేసింది. దాంతో కరోనా మృతులలో చైనాకు ఉన్న రికార్డును ఇటలీ సొంతం చేసుకుంది. ఇటలీలో కరోనా ప్రభావం ఎంతగా ఉందో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.

ఇక ఇటలీ తర్వాత కరోనా వల్ల ఇబ్బందిపడుతున్న మరోదేశం ఇరాన్. అక్కడ 18,407 కేసులు నమోదుకాగా.. 1284 మంది చనిపోయారు.

కరోనా కేసులు నిమిషనిమిషానికి పెరుగుతూనే ఉన్నాయి. నిన్న ఒక్కరోజే దాదాపు 26వేల కేసులు నమోదయ్యాయి.
ఇండియాలో కరోనా కేసులు 195 నమోదుకాగా.. ఇప్పటివరకు అయిదుగురు చనిపోయారు.

ప్రపంచవ్యాప్తంగా 2,46005 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. దాదాపు 10 వేల మందికి పైగా మరణించారు. కరోనా బారినపడి 88,471 మంది కోలుకున్నారు.

For More News..

సీఎం పదవికి రాజీనామా చేసిన కమల్‌నాథ్

‘ఉద్యోగులు ఆఫీసుకు రాకపోయినా జీతాలివ్వాలి’

30 నిమిషాలపాటు ఉరితాడుకు వేలాడిన నిర్భయ దోషులు

ఉరికి ముందు నిర్భయ దోషులు ఏంచేశారంటే..

నిర్భయ కేసు: దోషుల్లో అతను ఇంగ్లీష్ కూడా మాట్లాడగలడు

నిర్భయ దోషులకు ఉరి అమలు

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా.. 2 లక్షలు దాటిన కేసులు

Latest Updates