కరోనా భయంతో.. ‘కార్డ్ బోర్డ్ డిస్క్’తో తిరుగుతుండు

అసలే కరోనా వైరస్ దునియా మొత్తాన్ని షేక్ చేస్తున్నది. పబ్లిక్ లకు పోతే ఎవరి నుంచి వైరస్ అంటుకుంటదోనని అందరిలోనూ బుగులు మొదలైంది. ఇటలీలో ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుండటం, చాలా మంది చనిపోతుండటంతో జనాల్లో ఈ భయం మరింత ఎక్కువైపోయింది. మరోవైపు పబ్లిక్ లకు పోవాల్సి వస్తే.. కరోనా లక్షణాలున్నవాళ్లకు కనీసం 3 ఫీట్ల దూరం ఉండాలని డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్ ఇచ్చింది. అందుకే.. ఇటలీలోని రోమ్ కు చెందిన ఓ పెద్దాయన ఇట్లా కార్డ్ బోర్డ్ డిస్క్ తయారు చేసుకున్నడు. జనాలు ఎవరూ తన దగ్గరకు రాకుండా.. దాన్ని నడుముకు తగిలించుకుని తిరుగుతున్నడు. ఎవరన్నా.. చూసి ‘పెద్దాయనా.. గిదెందుకు తగిలించుకున్నవ్?’ అని అడిగితే.. ‘కరోనా వైరస్ కోసం’ అని చెప్తున్నడు. బుధవారం ఎవరో ఈ వీడియోను ట్విట్టర్ లో పెట్టడంతో ఒక్కసారిగా వైరల్ అయిపోయింది.

Latest Updates