ఇటలీలో ఒక్కరోజే 743 మంది మృతి

ఇటలీలో ఒక్కరోజే 743 మంది మృతి ఇటలీలో మరణ మృదంగం మోగుతూనే ఉంది. రోజురోజుకూ కరోనా బాధితుల చావుకేకతో దద్దరిల్లిపోతోంది. మంగళవారం ఒక్కరోజే ఆ దేశంలో 743 మంది వైరస్ కు బలయ్యారు. దీంతో మొత్తం చనిపోయిన వారిసంఖ్య 6,820కి పెరిగింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 69,176కి చేరింది. ఒక్కరోజులో 5,429 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 18,260 మందిని కరోనా బలి తీసుకుంది. కేసులు 4,08,913 నమోదయ్యాయి . ఒక్కరోజులోనే 30,131కొత్త కేసులు రిపోర్ట్​ అయ్యాయి . మూడు రోజుల్లోనే కొత్తగా లక్ష కేసులు నమోదయ్యాయి .మొత్తంగా 1,07,073 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇటు స్పెయిన్ లో ఒక్కరోజులోనే 489 మంది వైరస్ కు బలయ్యారు.

21 డేస్ లాక్​ డౌన్..​ కేంద్రం గైడ్ లైన్స్ ఇవే..

Latest Updates