పరీక్షలు అక్కర్లేదు, వెంటనే రంగంలోకి దిగండి. మెడికోలకు ఆదేశాలు

కరోనా వైరస్ దెబ్బకు చైనా తర్వాత ఆ స్థాయిలో అల్లాడిపోతతున్న దేశం ఇటలీ. ఇప్పటికే ఆ దేశంలో 35, 713  కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 2,978 మంది మరణించారు. సమస్య ఇంకా తీవ్రమవుతుండడంతో అక్కడి ప్రభుత్వం కరోనాను కట్టడి చేసేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

ఎక్కువ మొత్తంలో కరోనా కేసులు నమోదవడంతో అక్కడి ఆస్పత్రులో పేషెంట్లకు చికిత్స చేసేందుకు వైద్య సిబ్బంది కరువైంది. దీంతో సాధ్యమైనంత ఎక్కువ మంది వైద్యులను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా మెడిసిన్ చదువుతున్న 10,000 మంది వైద్య విద్యార్థుల పరీక్షలను రద్దు చేసింది.  వారిని వెంటనే కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స అందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

అక్కడి యూనివర్శిటీ మినిస్టర్ గైతానో మన్‌ఫ్రెడి ఈ విషయంపై మాట్లాడుతూ..  “ఈ ఏడాది మెడికల్ విద్యార్ధుల పరీక్షలను రద్దు చేశాం.  తొమ్మిది నెలల ముందుగానే వారిని ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందించడానికి ప్రభుత్వం అనుమతిస్తోంది” అని చెప్పినట్టు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ తెలిపింది.

Italy will rush 10,000 student doctors into service, scrapping final exams

Latest Updates