ITBPలో కానిస్టేబుళ్ల ఉద్యోగాలు

itbpఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ITBP)లో 134 గ్రూప్-సీ(నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టిరియల్) కానిస్టేబుల్ పోస్టులకు భారతీయ యువకుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. తాత్కాలికంగా తీసుకున్నా.. శాశ్వతమయ్యే అవకాశం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులను దేశంలో ఎక్కడైనా.. ఇతర దేశాల్లోనైనా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ITBPF చట్టం 1992, ITBPF నిబంధనలు 1994లను అనుసరించి నియామకం జరుగుతుంది. ఆన్‌లైన్లో మాత్రమే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

 సంస్థ పేరు: ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్

ఖాళీల సంఖ్య: 134

జాబ్ లొకేషన్: భారతదేశంలో ఎక్కడైనా

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి / సంస్థ నుంచి మెట్రిక్యూలేషన్ లేదా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లైట్/  మీడియం/ హెవీ మోటార్ వెహిల్ లైసెన్స్ కలిగి ఉండాలి. డ్రైవింగ్‌లో రెండేళ్ల అనుభవం ఉండాలి.

ఏజ్ లిమిట్ : 15.03.2018 నాటికి 21-27 ఏళ్ల వయస్సు ఉండాలి

జీతం: రూ. . 21,700 – 69,100/-

రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 14.02.2018

దరఖాస్తు చివరి తేదీ: మార్చి 15, 2018

http://www.davp.nic.in/WriteReadData/ADS/eng_19143_15_1718b.
pdf

Posted in Uncategorized

Latest Updates