కోతులతో తిప్పలు.. ఎలుగుబండి వేషాల్లో జవాన్లు: వీడియో వైరల్

ప్రతి రోజూ కోతులు గుంపులుగా వచ్చి.. ఇళ్లపై పడి హల్‌చల్ చేస్తుంటే ఎవరైనా విసిగిపోతారు. రోజూ వాటిని తరమలేక నానాపాట్లు పడుతుంటారు. వాటిని బెదరగొట్టడానికి పటాకులు పేల్చడం లాంటివి చేస్తుంటారు కొందరు. అయినా మళ్లీ మళ్లీ వచ్చేస్తుంటాయి.

ఇలాంటి పరిస్థితే ఉత్తరాఖండ్‌లోని మిర్తిలో ఉన్న ఐటీబీపీ జవాన్లకు కూడా ఎదురైంది. కోతులు రోజూ క్యాంప్‌పై పడి నానా రభస చేస్తుండడంతో విసిగిపోయారు. ఓ వినూత్న ఆలోచనతో వాటిపై ఏ మాత్రం దాడి చేయకుండా తరిమికొట్టారు. ఇద్దరు ఐటీబీపీ జవాన్లు ఎలుగుబంటి సూట్లు వేసుకుని అక్కడి నుంచి తరిమేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Latest Updates