14 వేల అడుగులపై ఇండిపెండెంట్స్‌ డే సెలబ్రేషన్స్‌

ఫొటోలు పంచుకున్న ఐటీబీపీ

లడఖ్‌: ఇండో–టిబెటన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ) స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులను 14 వేల ఫీట్‌ల ఎత్తుపై సెలబ్రేట్ చేసుకుంది. లడఖ్‌లోని ప్యాంగాంగ్ ట్సో నదీ తీరం నుంచి అత్యంత ఎత్తుపై ఈ వేడుకలను జరుపుకున్న జవాన్లు త్రివర్ణ పతాకాన్ని తమతో పాటు తీసుకెళ్లారు. వేడుకల సందర్భంగా సోల్జర్స్ పాడిన దేశభక్తి పాటను ఐటీబీపీ విడుదల చేసింది. తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఐటీబీపీ వీటిని షేర్ చేసింది. ‘తల్లి భారతి జయహో. ఇండింపెండెంట్స్‌ డే సందర్భంగా దేశానికి ఐటీబీపీ సెల్యూట్ చేస్తోంది’ అంటూ ఐటీబీపీ ట్వీట్ చేసింది. గత మూడు నెలల్లో ఇండో–చైనా సరిహద్దు ఘర్షణల్లో రక్తమోడి పోరాడిన 21 మంది జవాన్లకు ఐటీబీపీ శౌర్య పతకాలను రికమెండ్ చేసింది.

Latest Updates