ఐటీసీ నుంచి 3D నోట్​ బుక్స్​

హైదరాబాద్, వెలుగు : ఐటీసీ నోట్​ బుక్​​ బ్రాండ్.. క్లాస్మేట్ యువత కోసం తయారు చేసిన 3డీ నోట్​ బుక్స్​ను హైదరాబాద్లో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో విడుదల చేసింది. వీటి కవర్​పై ముద్రించిన బొమ్మలు 3డీలో కనిపిస్తాయి. లెంటిక్యులర్ బోర్డ్ ద్వారా వీటిని తయారు చేసినట్టు ఐటీసీ తెలిపింది. ఈ సందర్భంగా పల్స్ పేరుతో స్పైరల్ నోట్​ బుక్స్​ను కూడా ఆవిష్కరించింది. ఇవి ఎక్కువ కాలం మన్నుతాయని తెలిపింది. ఈ సందర్భంగా ఐటీసీ లిమిటెడ్ ఎడ్యుకేషన్ అండ్ స్టేషనరీ ప్రొడక్ట్స్ బిజినెస్ డివిజన్ సీఈఓ శైలేంద్ర త్యాగి మాట్లాడుతూ ‘‘3డీ నోట్​ బుక్స్​ కవర్స్​ను పాలీ ప్రోప్లీన్ కవర్​తో తయారు చేయడం వల్ల ఎంతో నాణ్యంగా ఉంటాయి. వీటిని చుట్టినా, మడతపెట్టినా ఏమీ కాదు. వీటికి వాడుతున్న కాగితం పర్యావరణానికి అనుకూలమైనది.

ఈ నోట్​బుక్స్​ను భద్రాచలంలోని మా ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నాం. ప్రతి 10 మంది విద్యార్థుల్లో ముగ్గురు మా బ్రాండ్ నోట్​ బుక్స్​ను వాడుతున్నారు. మా మొబైల్ యాప్​కు సెల్ఫీలు పంపితే వాటిని నోట్​ బుక్స్​పై ముద్రించి ఇచ్చే సదుపాయాన్ని కూడా ప్రవేశపెట్టాం. మనదేశంలో నోట్​ బుక్స్​ మార్కెట్ విలువ రూ.1,500 కోట్లు కాగా, ఇందులో మా మార్కెట్ వాటా 25 శాతం. వచ్చే ఏడాది రెండంకెల వృద్దిని సాధించాలని టార్గెట్ విధించుకున్నాం. క్లాస్మేట్ నోట్​ బుక్స్​ గల్ఫ్ దేశాలకు ఎగుమతి కూడా చేస్తున్నాం”అని త్యాగి వివరించారు.

Latest Updates