భద్రాచలం ఐటీసీకి గ్రీన్‌కో ప్లాటినమ్‌+ రేటింగ్‌

ITC’s Bhadrachalam facility gets ''GreenCo Platinum+'' rating by CII

భద్రాచలంలో ప్రపంచశ్రేణి సమగ్రమైన సదుపాయం కలిగిన ఐటీసీ పేపర్‌బోర్డ్స్‌ అండ్‌ స్పెషాలిటీ పేపర్స్‌ బిజినెస్‌ (పీఎస్‌పీబీ)ను కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) … గ్రీన్‌ బిజినెస్‌ సెంటర్‌ గ్రీన్‌కో ప్లాటినమ్‌+ రేటింగ్‌తో గుర్తించింది. గ్రీన్‌ కంపెనీ రేటింగ్‌ వ్యవస్థలో భాగంగా పల్ప్‌ అండ్‌ పేపర్‌ రంగంలో ఈ గుర్తింపు పొందిన ఒకే ఒక్క కంపెనీగా పీఎస్‌పీబీ నిలిచింది. అంతేకాకుండా దేశం మొత్తంమ్మీద ఈ రేటింగ్‌ పొందిన రెండవ కంపెనీగా ఐటీసీ పీఎస్‌పీడీ నిలిచింది.

ఈ ప్రతిష్టాత్మక రేటింగ్‌ను, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తూ, పూర్తి నిబద్ధత ప్రదర్శించే కంపెనీలకు అందిస్తారు. ఐటీసీ సంస్థ గత 15 సంవత్సరాలుగా కార్బన్‌ పాజిటివ్‌గా నిలువడంతో పాటుగా 18 సంవత్సరాలుగా వాటర్‌ పాజిటివ్‌ మరియు 13 సంవత్సరాలుగా ఘన వ్యర్థాల రీసైక్లింగ్‌ పాజిటివ్‌గా గుర్తింపు పొందింది. ఇతర అంతర్జాతీయ సదుపాయాలతో సమానంగా భద్రాచలం యూనిట్ గ్రీన్‌ ప్రమాణాలను కలిగి ఉందని గ్రీన్‌కో ప్లాటినమ్‌ ప్లస్‌ రేటింగ్‌ వెల్లడించింది.

ITC’s Bhadrachalam facility gets ''GreenCo Platinum+'' rating by CII

Latest Updates