ITI క్వాలిఫికేషన్ చాలు : రైల్వేలో 4,103 ఉద్యోగాలు

jobsనిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారీ రిక్రూట్ మెంట్ కు నోటిఫికేషన్ విడుదల చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. జూన్ 27వ తేదీ బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్  ద్వారా 4 వేల 103 ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. 10వ తరగతి, ITI క్వాలిఫికేషన్ ఉంటే చాలా దరఖాస్తుకు అర్హులు. రిజర్వేషన్ల వారీగా SCలకు 616, STలకు 308, OBCలకు వెయ్యి 107, జనరల్ కేటగిరీ వారికి 2వేల 72 పోస్టులను కేటాయించారు.

ఏసీ మెకానిక్‌ విభాగంలో 249 పోస్టులు, కార్పెంటర్‌ విభాగంలో 16, డీజిల్‌ మెకానిక్‌ విభాగంలో 640, ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో 18, ఎలక్ట్రీషియన్‌ విభాగంలో 871, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌ విభాగంలో 102, ఫిట్టర్‌ విభాగంలో 1,460, మెషినిస్ట్‌ విభాగంలో 74, MMWవిభాగంలో 24 , MMTM విభాగంలో 12, పెయింటర్‌ విభాగంలో 40, వెల్డర్‌ విభాగంలో 597 పోస్టులు ఉన్నాయి. జూన్ 18 నాటికి 24 ఏళ్లలోపు వయసున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆన్‌ లైన్‌ ద్వారా జూలై 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

 

 

 

Posted in Uncategorized

Latest Updates