కరోనా నుంచి కోలుకున్నాక శుభవార్త: బ్రిటన్ ప్రధానికి మగబిడ్డ

బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ దంపతులకు బుధవారం మగ బిడ్డ పుట్టింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. లండన్ హాస్పిటల్ లో డెలివరీ అయినట్లు చెప్పారు. బోరిస్ జాన్సన్ కు నెల క్రితం కరోనా సోకగా… ప్రమాదం అంచులకు వెళ్లారు.  జోరీస్ తో పాటు ఆయన భార్య కారీ సైమండ్స్ కు కూడా వైరస్ సోకింది. అయితే ఆమె త్వరగా కోలుకోగా… జాన్సన్ కోలుకోవడానికి సమయం పట్టింది. నెల రోజుల తర్వాత సోమవారం విదులకు హాజరయ్యారు బోరిస్.

బోరీ జాన్సన్ ప్రధాన మంత్రి అయినప్పటినుంచి బోరీ, కారీ సైమండ్స్ సహజీవనం చేస్తున్నారు. ప్రస్తుతం వీరికి మొదటి బిడ్డ జన్మించింది. బోరీస్, కారీ దంపతుల ఇంట్లో ఆనందం వెల్లివిరిసిందంటూ ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి మట్ హకాక్ ట్విటర్ లో అభినందనలు తెలిపారు. జాన్సన్  మొదటి భార్య అయిన మారియా వీలర్ ఈ సంవత్సరంలోనే విడాకులు తీసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు. అయితే వీరు 2018లోనే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

Latest Updates