న్యాయమూర్తి, న్యాయ సంఘము, ఉరిశిక్ష వేసేవాడు ఇలా ముగ్గురు ఒక్కటయ్యారు

గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎం యాప్ ను తాత్కాలికంగా నిలిపివేయడాన్ని ఆ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్ శేఖర్ శర్మ స్పందించారు.

న్యాయమూర్తి, న్యాయ సంఘము, ఉరిశిక్ష వేసేవాడు ఇలా ముగ్గురు ఒక్కటయ్యారని ఆరోపించారు. ఇది గూగుల్ -నిర్భర్ భారత్ కాదు ఆత్మనిర్భర్ భారత్ అని శేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు.
పేటీఎం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఫీచర్ ను తొలగించిన తరువాత గూగుల్ తన ప్లేస్టోర్ లో పేటీఎం ను యాడ్ చేసింది.

అయితే దీనిపై పేటీఎం సీఈఓ మాట్లాడుతూ తమ వినియోగదారులకు క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తున్నట్లు తెలిపారు. దాన్ని గ్యాంబ్లింగ్ అనడం ఎంత వరకు సమంజసం అని అన్నారు. అది గ్యాంబ్లింగ్ అంటే దాని గురించి ఏం చెప్పాలో తనకు అర్ధం కావడం లేదన్నారు.

Latest Updates