అది నా బెస్ట్‌.. అందుకే వీడియో మళ్లీ మళ్లీ చూస్తున్నా..

స్మిత్‌ రనౌట్‌పై రవీంద్ర జడేజా

సిడ్నీ: థర్డ్‌ టెస్ట్‌ రెండో రోజు స్టీవ్‌ స్మిత్‌ను రనౌట్‌ చేసిన ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా తాను ఎంత గొప్ప ఫీల్డరో మరోసారి ప్రూవ్‌ చేశాడు. అంతేకాక స్మిత్‌ను రనౌట్‌ చేసిన విధానం తన బెస్ట్‌ పెర్ఫామెన్స్‌ అని, ఆ వీడియోను మళ్లీమళ్లీ చూసుకుంటానని జడ్డూ పేర్కొన్నాడు. చివరి బ్యాట్స్‌మన్‌ హేజిల్‌వుడ్‌తో కలిసి క్రీజులో ఉన్న స్మిత్‌.. బ్యాటింగ్‌లో ఒక్కసారిగా జోరు పెంచాడు. ఈ క్రమంలో స్మిత్‌ బ్యాట్‌ ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకున్న  ఓ బాల్‌.. స్క్వేర్‌ లీగ్‌ వైపు దూసుకెళ్లింది. దీంతో స్మిత్ డబుల్‌ రన్‌ కోసం ట్రై చేశాడు. కానీ డీప్‌ నుంచి మెరుపులా దూసుకొచ్చి బాల్‌ను అందుకున్న జడ్డూ.. డైరెక్ట్‌ త్రో చేసి స్మిత్​ను రనౌట్​ చేశాడు. మ్యాచ్‌ అనంతరం ఆ రనౌట్‌ గురించి జడ్డూ మాట్లాడాడు. ‘ ఈ రనౌట్‌ నా బెస్ట్‌  పెర్ఫామెన్స్‌.  అందుకే ఈ వీడియోను మళ్లీమళ్లీ చూసుకుంటా. 30 యార్డ్స్‌ సర్కిల్‌ బయట నుంచి డైరెక్ట్‌ త్రో తో  వికెట్లను కొట్టడం అంటే.. ఆ మూమెంట్‌ చాలా తృప్తినిస్తోంది.  మూడు, నాలుగు వికెట్లు సాధించడం కూడా బాగానే ఉంటుంది. కానీ ఈ రనౌట్‌ ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని జడేజా పేర్కొన్నాడు.

డబుల్ బెడ్‌రూం ఇళ్లు అమ్మినా.. కిరాయికి ఇచ్చినా పట్టా రద్దు

ఫ్రెండ్ షిప్ పేరుతో ట్రాప్‌‌‌‌‌‌‌‌.. గిఫ్ట్‌లు తెచ్చామంటూ మోసాలు

హోమ్‌‌ లోన్లపై ఎస్‌‌బీఐ గుడ్‌‌న్యూస్

Latest Updates