వైరల్ : తాజ్ మహల్ అందంతో.. పోటీపడ్డ ఇవాంకా

అమెరికా అధ్యక్షుడి సలహాదారు. అధ్యక్షుడి కూతురు. అందునా.. అందానికి కేరాఫ్. ఆమే ఇవాంకా ట్రంప్. ప్రెసిడెంట్ కూతురైనా అధికారిగానే పర్యటించిన ఆమెపై ఇండియా మీడియా, సోషల్ మీడియా అటెన్షన్ మామూలుగా లేదు. కాస్ట్యూమ్ దగ్గర్నుంచి… ఆటిట్యూడ్ వరకు.. అన్నీ దగ్గరగా గమనించారు అభిమానులు. తాజ్ మహల్ దగ్గర ఇవాంకా ఫొటోలైతే.. క్షణాల్లో వైరల్ అయిపోయాయి.

భారత్ లో రెండోసారి పర్యటించారు అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ట్రంప్. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులకు ప్రధాని మోడీ, అమెరికా అధికారులతో కలిసి స్వాగతం పలికారు ఇవాంకాట్రంప్. 2017 నవంబర్ లో గ్లోబల్ ఆంట్రప్రెన్యూర్ షిప్ సమ్మిట్ తర్వాత.. ప్రధానిమోడీని ఇవాంక కలుసుకోవడం ఇదే మొదటిసారి. ఎయిర్ పోర్టులో దిగిన తర్వాత.. ట్రంప్ దంపతులకు అమెరికా పద్ధతిలో స్వాగతం పలికారు ఇవాంక, ఇతర అధికారుల బృందం.

ఆ తర్వాత.. ట్రంప్ టీమ్ తో పాటు.. ఇవాంకా మొతేరా స్టేడియానికి వెళ్లారు. స్టేడియంలో ఉల్లాసంగా కనిపించిన ఇవాంకా… మహిళా ఆంట్రప్రెన్యూర్స్, అధికారులతో సెల్ఫీలు దిగారు. ట్రంప్ స్పీచ్ ను ఇంట్రస్ట్ గా విన్నారు. ఇదే టైంలో అక్కడున్నవాళ్లతో ఇంటరాక్ట్ అయ్యారు.

అహ్మదాబాద్ లో నమస్తే ట్రంప్ ప్రోగ్రామ్ కళ్లుచెదిరేలా నిర్వహించారని చెప్పారు అమెరికా ప్రెసిడెంట్ అడ్వైజర్ ఇవాంకా ట్రంప్. ప్రెసిడెంట్ ట్రంప్, ప్రధాని మోడీ ప్రసంగం తర్వాత… ఇవాంకా ట్రంప్ మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.

తాజ్ మహల్ దగ్గర ఇవాంకా తన భర్త కుష్నర్ తో సందడి చేశారు. కెమెరాలన్నింటినీ తనవైపుకు తిప్పుకున్నారు. తాజ్ మహల్ దగ్గర ఇవాంకా చిరునవ్వుతో మెరుపులు మెరిపించారు. తాజ్ మహల్, ఇవాంకా కాంబినేషన్లో ఉన్న ఫొటోలు వీడియోలు సెకన్లలో వైరల్ అయ్యాయి. తాజ్ మహల్ అందంతో.. ఇవాంకా పోటీపడ్డారంటూ నెటిజన్లు కామెంట్ చేశారు. అమెరికా అధికారుల బృందంతో కలిసి ఇవాంకా ఫొటోలు దిగారు. తన పర్సనల్ కెమెరాతో తాజ్ మహల్ పరిసరాలను వీడియో తీసుకున్నారు ఇవాంకా.

వాయిస్.. ఇవాంకా వేసుకున్న కాస్ట్యూమ్స్ , ఆమె వాడిన సెల్ ఫోన్ పైనా ఇంటర్నెట్ లో పెద్ద చర్చే జరిగింది. గతేడాది అర్జెంటీనాలోనూ ఇదే డ్రెస్సింగ్ లో పర్యటించారు ఇవాంక. ఆమె వేసుకున్న కలర్ ఫుల్ బేబీ బ్లూ, రెడ్ ఫ్లోరల్ ప్రింటెడ్ మిడీ..  ఆకట్టుకుంది. ప్రొయెంజా స్కౌలర్ అనే బ్రాండ్ ఈ డ్రెస్ ను డిజైన్ చేసింది. లైఫ్ స్టైల్ బ్రాండ్ కు అంబాసిడర్ గా పనిచేసిన ఇవాంకా… తన ఔట్ ఫిట్ లో మరోసారి పవర్ ఫుల్ ఫ్యాషన్ స్టేట్ మెంట్ ఇచ్చారంటున్నారు నెటిజన్లు.

Latest Updates