ఓర్పు, ప్రేమకు ఇది నిదర్శనం..1200 కి.మీ. తండ్రిని తీసుకెళ్లిన జ్యోతి

వాషింగ్టన్‌: యాక్సిడెంట్‌లో దెబ్బలు తగిలి, లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన తండ్రిని 1200 కి.మీ. సైకిల్‌పై సొంత ఊరికి తీసుకొచ్చిన జ్యోతిని అమెరికా ప్రెసిడెంట్‌ కూతురు ఇవాంక ట్రంప్‌ పొగిడారు. ఓర్పు, ప్రేమకు ఇది నిదర్శనం అని ఇవాంక ట్వీట్‌ చేశారు. “ 15 ఏళ్ల జ్యోతి కుమారి దెబ్బలు తగిలిన తన తండ్రిని వెనక కూర్చోబెట్టుకుని 7 రోజుల పాటు 1200 కి.మీ. సైకిల్‌ తొక్కి సొంత ఊరికి చేర్చింది. ఓర్పు, ప్రేమ కలిగిని ఈ అందమైన పాదాన్ని ఇండియన్స్, సైకిల్‌ ఫెడరేషన్‌ గుర్తించేలా చేసింది” అని ఇవాంక ట్రంప్‌ ట్వీట్‌ చేశారు.

బీహార్‌‌లోని దర్బాంగ్‌కు చెందిన జ్యోతి తన తండ్రితో కలిసి గురుగ్రామ్‌లో నివాసముంటుంది. ఆటో డ్రైవర్‌‌ అయిన తండ్రి గాయపడడమే కాకుండా లాక్‌డౌన్‌ విధించడం వల్ల పనిలేకుండా పోయింది. దీంతో వారు సొంతూరు వెళ్లాలని భావించి ఓ సైకిల్‌ను కొన్నారు. వెనుక తండ్రిని కూర్చోబెట్టుకుని గురుగ్రామ్‌ నుంచి బిహార్‌‌కు ఏడు రోజుల్లో 1200 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కింది. ఈ విషయం తెలుసుకున్న సైక్లింగ్‌ ఫెడరేషన్‌ అధికారులు జ్యోతికి స్వయంగా ఫోన్‌ చేసి ట్రయల్స్‌ కోసం ఢిల్లీకి రమ్మని పిలాచారు. దానికి అయ్యే ఖర్చులను కూడా తామే భరిస్తామని చెప్పారు.

Latest Updates