కాంప్రమైజ్ కాలేక బైక్ నడపడానికి ట్రై చేశా

‘జెర్సీ’ సినిమా చూశాక శ్రద్ధా శ్రీనాథ్‌‌ ఎంత టాలెంటెడ్ అనేది అందరికీ తెలిసింది. అయితే తమిళ ఆడియెన్స్ ‌కి మనకంటే బాగా తెలుసు. విక్రమ్ వేద, నేర్కొండ పార్వై లాంటి మంచి చిత్రాలు చేసిందామె. తెలుగులో మాత్రం అప్పుడప్పుడు ఒక్కో సినిమాలో తళుక్కుమంటోంది. ఆమె నటించిన ‘కృష్ణ అండ్ హిజ్‌‌ లీల’ మూవీ ఓటీటీలో రిలీజ్‌‌కి రెడీ అవుతోంది. ఏ సినిమా చూసినా శ్రద్ధ తన పాత్రను బాగా పండించడానికి నూరు శాతం ట్రై చేసిందని అనిపిస్తూ ఉంటుంది. దానికి కారణం.. ఆమెకి కాంప్రమైజ్ కావడం ఇష్టముండదట. రాజీ పడకుండా ఓసారి బైక్ నడపడానికి ట్రై చేస్తే ఏమయ్యిందో సోషల్ మీడియాలో చెప్పింది. మూడేళ్ల క్రితం నంది హిల్స్‌ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు దర్శకుడు వచ్చి బైక్ నడపడం వచ్చా అని అడిగాడట. ‘రాదు కానీ ట్రై చేస్తాను’ అంటూ బైక్ తీసుకుందట శ్రద్ధ. ఎనిమిదేళ్ల వయసులో బండి నడపడం నేర్చుకోవడంతో ధైర్యంగా బైక్ తీసుకుని రోడ్డెక్కింది. కానీ రోడ్లు తడిగా ఉండటంతో స్కిడ్ అయ్యి పడిపోయింది. ఆమె అసిస్టెంట్ ఇదంతా షూట్ చేశాడు. ఆ వీడియోని ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో పోస్ట్ చేసింది. కాంప్రమైజ్ కావడం ఇష్టం లేకే ఆ ప్రయత్నం చేశానని చెప్పింది. ఎంతో బరువైన రాయల్ ఎన్‌‌ఫీల్డ్ నడపడానికి కూడా వెనుకాడలేదంటే.. దాన్ని బట్టే తెలుస్తోంది ఆమె డెడికేషన్ ఏమిటో.

Latest Updates