రివ్యూ : జాను

రన్ టైమ్: 2 గంటల 31 నిమిషాలు

నటీనటులు: శర్వానంద్,సమంత,వెన్నెల కిషోర్,శరణ్య,తాగుబోతు రమేష్ తదితరులు

సినిమాటోగ్రఫీ:మహేంద్రన్ జయరాజు

మ్యూజిక్: గోవింద్ వసంత

ఎడిటర్: కె.ఎల్ ప్రవీణ్

మాటలు: మిర్చి కిరణ్

నిర్మాత: దిల్ రాజు

రచన,దర్శకత్వం: ప్రేమ్ కుమార్

రిలీజ్ డేట్: ఫిబ్రవరి 7,2020

కథేంటి?

స్కూల్లో చదువుకున్నప్పటినుంచే జానకీ దేవి అంటే రామకృష్ణ కు ప్రాణం.ఆమే లోకమై బతుకుతుంటాడు.కొన్ని కారణాల వల్ల వాళ్లు దూరమవ్వాల్సి వస్తుంది.17 ఏళ్ల తర్వాత స్కూల్ ఫ్రెండ్స్ తో రీ యూనియన్ ద్వారా కలుసుకున్న వాళ్లిద్దరి మధ్య జరిగిన పరిణామాలేంటి? అసలెందుకు విడిపోయారు.చివరికి వీళ్ల జర్నీ ఎలా సాగిందనేది కథ.

నటీనటుల పర్ఫార్మెన్స్:

శర్వానంద్ మెచ్యుర్డ్ పర్ఫార్మెన్స్ తో కట్టిపడేసాడు.ఒరిజినల్ వెర్షన్ లో విజయ్ సేతుపతి నటనకు ఏమాత్రం తగ్గకుండా నటించి మెప్పించాడు.ముఖ్యంగా సెకండాఫ్ లో శర్వా మంచి నటన కనబరిచాడు.సమంత కూడా మంచి పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది.ఎమోషనల్ సీన్లలో బాగా చేసింది.ఇక హైస్కూల్ డేస్ లో నటించిన అందరూ బాగా చేశారు.,వెన్నెల కిషోర్,తాగుబోతు రమేష్, శరణ్య కూడా బాగా చేశారు.

టెక్నికల్ వర్క్:

గోవింద్ వసంత పాటల్లో రెండు చాలా బాగున్నాయి.ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమా మూడ్ ను బాగా క్యారీ చేశాడు.మహేంద్రన్ జయరాజు సినిమాటోగ్రఫీ బాగుంది.ప్రొడక్షన్ వాల్యూస్,ఆర్ట్ వర్క్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి.డైలాగులు మెప్పిస్తాయి.ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా ఉండాల్సింది.

విశ్లేషణ:

తమిళంలో 96 అనే మూవీ ఈ మధ్య వచ్చిన లవ్ స్టోరీస్ లో ది బెస్ట్.ఆ సినిమాను రీమేక్ చేయడమంటే సాహసమే.కానీ నిర్మాత దిల్ రాజు అదే డైరెక్టర్ ప్రేమ్ కుమార్ ను పెట్టుకుని సగం సక్సెస్ అయ్యాడు.అనుకున్నట్టే.ఒరిజినల్ డైరెక్టర్ కావడంతో 96 మ్యాజిక్ మళ్లీ క్రియేట్ చేయడంలో మేజర్ పార్ట్ సక్సెస్ అయ్యాడు.ఆ సినిమా చూడని వాళ్లకు ఈ ‘‘జాను’’ మంచి అనుభూతినిస్తుంది.ఇక చూసిన వాళ్లకు ఓకే అనిపిస్తుంది. సమంత,శర్వానంద్ ఇద్దరూ పోటీపడి ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అందించారు.ఇకపోతే స్లో పేస్ సినిమా కావడంతో అందరికీ రుచించకపోవచ్చు. ఫస్టాఫ్ లో హైస్కూల్ ఎపిసోడ్స్ లో మంచి ఎంటర్ టైన్మెంట్ ఉండటం తో హాయిగా సాగుతుంది. సెకండాఫ్ మాత్రం స్లోగా ,ఎమోషనల్ గా సాగుతుంది. మొత్తానికి డైరెక్టర్ ఒరిజినల్ వెర్షన్ ను మాత్రం చెడగొట్టకుండా బాగానే తీసాడు.

స్లో..ఎమోషనల్ ‘జాను‘

Latest Updates