జబర్దస్త్ కమెడియన్ వినోద్ పై దాడి…

జబర్దస్త్ కమెడియన్ వినోద్ పై దాడి జరిగింది. ఈ ఘటన కాచిగూడ పోలీస్టేషన్ పరిదిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. జబర్ధస్త్ కమెడియన్ వినోద్.. కాచిగూడలో ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. ఇందుకు గాను 10 లక్షల రూపాయలను అడ్వాన్స్ గా ఆ ఇంటి ఓనర్ కు ఇచ్చానని చెప్పాడు. అయితే 30 గజాల స్థలంలో గోడ నిర్మాణం విషయంలో ఇళ్లు అమ్ముతున్న అతనికి తనకు గొడవ జరిగిందని అన్నాడు. దీంతో బాలాజీ, ప్రమీల, సాయి చందర్ లు తనపై దాడి చేసినట్లు గా పోలీసులకు ఫిర్యాదు చేశాడు వినోద్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వినోద్ జబర్ధస్త్ షో లోని చంద్ర టీంలో ఫిమేల్ రోల్స్ చేస్తుంటాడు.

Latest Updates