రెండేళ్ల పాలన.. రెండు నిమిషాల్లో వివరించిన న్యూజిలాండ్ ప్రధాని జసిండా

వెల్లింగ్టన్: రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలను రెండు నిమిషాల్లో చెప్పి న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెన్  అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. తన సర్కారులో ఎచీవ్ మెంట్స్ ను వివరిస్తూ జసిండా శుక్రవారం వీడియో రిలీజ్ చేశారు. “92 వేల జాబ్ లు క్రియేట్ చేశాం, 2,200కుపైగా ఇళ్లు కట్టాం, జీరో కార్బన్ బిల్లు తెచ్చాం, హైవే ను సేఫ్ గా మార్చాం, జైళ్లలో ఖైదీల సంఖ్యను తగ్గించాం..”ఇలా రెండేళ్లలో చేసిన పనులన్నింటినీ ఆమె చకచకా రెండు నిమిషాల 56 సెకన్లలో గుక్క తిప్పుకోకుండా చెప్పిన వీడియో వైరల్ అయ్యింది. ఆన్ లైన్ లో  23 లక్షల మంది చూశారు. ఒక్క ఫేస్ బుక్ లోనే ఏడువేల కామెంట్లు వచ్చాయి. 37 ఏళ్ల వయసులో న్యూజిలాండ్ ప్రధాని అయిన జసిండా ఆర్డెన్ ఆ పదవిని చేపట్టిన చిన్న  వయస్కురాలుగా ఇదివరకే రికార్డు సాధించారు.

 

 

Latest Updates