కరోనా నివారణకు జాక్ మా భారీ విరాళం

చైనాలో కరోనా వైరస్ కలవరపెడుతోంది. వైరస్ బారిన పడిన చైనీయులను కబలిస్తోంది. దీంతో ప్రాణాంతక కరోనా వైరస్‌ని ఎదుర్కొనేందుకు చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. బాధితులకు కట్టుదిట్టమైన భద్రత మధ్య చికిత్స అందిస్తూనే.. మరోవైపు కరోనా వైరస్‌కు మందు కనిపెట్టే పనిలో తీవ్రంగా కృషి చేస్తున్నారు అధికారులు. ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాలు కూడా తమ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో చైనా ప్రభుత్వానికి ప్రముఖ వ్యాపారదిగ్గజం,  ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అలీబాబా అధినేత జాక్ మా సుమారు రూ.103 కోట్లు విరాళంగా ఇచ్చారు. వైరస్‌కు చెక్ పెట్టే వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేసేందుకు తన వంతు సాయంగా ఈ విరాళం అందజేశారు.

Latest Updates