కరోనా నివారణకు కోటి రూపాయలు: జాకీచాన్

కరోనా వైరస్ సోకి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది చనిపోయారు. వేలమంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు కరోనా వైరస్ ను అరికట్టేందుకు మెడిసిన్ కనిపెట్టే పనిలో సైంటిస్టులు తీవ్రంగా పరిశోధనలు చేస్తున్నారు. వీటి కోసం  పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా  ప్రముఖ నటుడు జాకీచాన్ కూడా ముందుకొచ్చారు. ప్రస్తుతం ఆయన వుహాన్ నగరంలో కరోనా నిరోధక మాస్కులు, ఇతర సామగ్రి అందజేస్తున్నారు. అంతేకాదు… కరోనా వైరస్ నివారణకు మందు కనిపెడితే కోటి రూపాయలు ఇస్తానని కూడా ప్రకటించారు. తన నగదు బహుమతి సైంటిస్టులను మరింత ప్రోత్సహిస్తుందని అనుకున్నట్లు తెలిపారు జాకీచాన్.

Latest Updates