మేకప్ మెన్ ను సప్రైజ్ చేసిన బాలీవుడ్ హీరోయిన్

బాలీవుడ్ హీరోయిన్, సాహో సినిమాలో ప్రభాస్ తో కలిసి ఐటమ్ సాంగ్ చేసిన హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరోసారి వార్తల్లో నిలిచింది. దసర పండగ సందర్భంగా  తన దగ్గర పనిచేసే  స్టాఫ్ కు కొత్త కారును కొనిచ్చింది జాక్వెలిన్. తన దగ్గర ఎన్నో ఏళ్లుగా మేకప్ మెన్‌గా వర్క్ చేస్తున్న వ్యక్తికి దసరా సందర్భంగా కార్‌ను బహుమతిగా ఇచ్చింది. జాక్వెలిన్ ప్రస్తుతం ఓ సినిమాలో ట్రాఫిక్ పోలీస్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో మేకప్ మ్యాన్ కు కారును గిఫ్ట్ గా కొనిచ్చి ఆశ్చర్య పరిచింది. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Latest Updates