అశేష భక్త జనవాహిని నడుమ స్వామి వారి కల్యాణం

Jadala Ramalingeshwara Swamy Kalyanam at Nalgonda
  • కల్యాణ౦ స‍౦దర్భ౦గా చెర్వుగట్టు గుట్టపైన భారీగా హాజరైన భక్తజన స౦దోహ౦

Jadala Ramalingeshwara Swamy Kalyanam at Nalgondaనల్లగొండ, వెలుగు: తెలంగాణ ప్రముఖ పుణ్య క్షేత్రం చెర్వు గట్టు ఆలయంలో బుధవారం శ్రీ జడల రామలింగేశ్వర స్వామి కల్యాణం కనుల పండువగా అశేష భక్త జనవాహిని నడుమ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున స్వామి వారికి రాష్ట్ర విధాన మండలి డిప్యూటీ చైర్మన్ శ్రీ నేతి విద్యాసాగర్ పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. కల్యాణాన్ని తిలకించేందుకు పలుజిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కల్యాణంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, నకిరేకల్​ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఆలయ పాలక మండలి చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి, అధికారులు హాజరయ్యారు.

Latest Updates