రెండో వికెట్ పడగొట్టిన రవీంద్ర జడేజా

మాంచెస్టర్ : వరల్డ్ కప్ ఫస్ట్ సెమీస్ లో న్యూజీలాండ్ కు భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. భాలత బౌలర్ల కుదురైన బౌలింగ్ తో.. కివీస్ స్కోరు బోర్డు నత్తనడక సాగుతోంది.

తొలి 20 ఓవర్లలో భారత బౌలర్లదే పేచేయి. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ లో ఒక పరుగుకే తొలి వికెట్ పడగొట్టిన ఇండియా… ఇన్నింగ్స్ 19వ ఓవర్లో రెండో వికెట్ తీసింది. గుప్తిల్ ను బుమ్రా ఔట్ చేస్తే… హెన్రీ నికోల్స్ ను జడేజా ఔట్ చేశాడు. ఐతే.. 20 ఓవర్లు ముగిసేసరికి కివీస్ 2 వికెట్లు కోల్పోయి 3.65 రన్ రేట్ తో.. కేవలం 73 రన్స్ చేసింది.