జడేజా ఏడుపు ఆపలేకపోయాను : భార్య రివాబా

వరల్డ్ కప్ సెమీస్ పై ఇండియాను గెలిపించేందుకు శాయశక్తులా ప్రయత్నించిన టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్రజడేజా ఆ మ్యాచ్ ఓటమి తర్వాత తీవ్రమైన ఆవేదన చెందాడు. ఈ విషయాన్ని రవీంద్రజడేజా భార్య రివాబా నేషనల్ మీడియాతో చెప్పారు.

గత బుధవారం నాడు మాంచెస్టర్ లో న్యూజీలాండ్ తో జరిగిన సెమీఫైనల్ లో రవీంద్ర జడేజా 59 బాల్స్ లో 77 రన్స్ చేసి ఔటయ్యాడు. ఇండియా విజయంపై ఆశలు రేపి.. గెలుపు దగ్గరగా తీసుకొచ్చిన సందర్భంలో ఔట్ కావడంతో.. జడేజా బాగా బాధపడ్డాడని ఆయన భార్య రివాబా తెలిపారు. ‘ఆ సమయంలో నేను క్రీజులో ఉండి ఉంటే ఇండియా గెలిచేది.. మేం ఫైనల్ కు వెళ్లేవాళ్లం’ అంటూ బోరున ఏడ్చాడని .. ఆయన్ను ఓదార్చతరం తనవల్ల కాలేదని చెప్పారు రివాబా జడేజా.

వరల్డ్ కప్ లో జడేజా టీమ్ లో ఉన్నా లేకున్నా తన పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడని చెప్పారు రివాబా. వికెట్లు తీయడంలో.. రన్స్ చేయడంలో.. పరుగులు ఆపడంలో ఆయన ఆల్ రౌండ్ షో చేశాడన్నారు.  ఐసీసీ 2013 ఛాంపియన్స్ ట్రోఫీని ఇండియా గెల్చినప్పుడు కూడా ఫైనల్ లో ఆల్ రౌండ్ షో చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా రవీంద్ర జడేజా నిలిచాడన గుర్తుచేశారు రివాబా.

Latest Updates