కాళేశ్వరం కడుతుంటే గాడిదలు కాశారా.. బాబుపై జగన్ ఫైర్

చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణలో కాళేశ్వరం కట్టారన్నారు ఏపీ సీఎం జగన్. ఏపీ అసెంబ్లీలో కరవు, ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా… అధికార, ప్రతి పక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి జగన్ ఎందుకు వెళ్లారని టీడీపీ ప్రశ్నించింది. కాళేశ్వరం కట్టేడప్పుడు చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా అంటూ జగన్ సమాధానమిచ్చారు. ఇరు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు జగన్.

ఐతే.. గోదావరి నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు తరలింపు అంశంపై జగన్ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. అందరితో చర్చించిన  తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోరారు.

Latest Updates