చంద్రబాబు పై గవర్నర్ కు జగన్ ఫిర్యాదు

శనివారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను కలిశారు ఏపీ ప్రతిపక్ష నేత జగన్. టీడిపీ కి ఓట్లు వేయని వారిని గుర్తించి.. వారి ఓట్లను తొలగిస్తున్నారని  ఫిర్యాదు చేశారు. 59.18 లక్షల దొంగ ఓట్లు ఏపీ లో ఉన్నాయని చెప్పారు. సర్వేల పేరుతో వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఓటర్ లీస్టులో లేకుండా చేస్తున్నారని అన్నారు. పోలీసుల పదోన్నతి విషయంలో అధికార దుర్వినియోగానికి సీఎం చంద్రబాబు ప్రభుత్వం పాల్పడిందని తెలిపారు. రాష్ట్ర డీజీపీ. ఇంటలిజెన్స్ చీఫ్, శాంతిభద్రతల ఐజిలు టీడీపీకి తోత్తులుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. గవర్నర్ ను కలిసిన వారిలో జగన్ తో పాటు.. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు విజయసాయి రెడ్డి, ధర్మాన ప్రసాదరావు తదితరులు ఉన్నారు.

Latest Updates