కేసీఆర్ కు తిరుపతిలో ఫ్లెక్సీల స్వాగతం

సీఎం కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ తిరుపతిలో భారీగా బ్యానర్లు వెలిశాయి. ఏపీ కాబోయే ముఖ్యమంత్రి జగన్, కేసీఆర్ ఫోటోలతో కూడిన భారీ ప్లెక్సీలను ప్రధాన కూడళ్లలో అమర్చారు. వైసీపీ నేతలు కూడా కేసీఆర్ కు స్వాగతం చెబుతూ భారీగా బ్యానర్లు కట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జగన్.. నిన్న హైదరాబాద్  ప్రగతి భవన్ వెళ్లి కేసీఆర్ ను కలిశారు. తన ప్రమాణస్వీకారానికి  ఆహ్వానించారు. ఏపీతో మంచి సంబంధాలు కొనసాగిస్తామని జగన్ కు కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే తిరుమల పర్యటనకు వచ్చిన కేసీఆర్ కు వైసీపీ నేతలు ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేశారు.

 

Latest Updates