జగన్ కోర్టుకి హాజరు కావలిసిందే: ఈడీ కోర్టు

సీబీఐ, ఈడీ కోర్టులో ఏపీ సీఎం జగన్ కు చుక్కెదురైంది. తనపై ఉన్న ఈడీ కేసుల విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న జగన్ పిటిషన్ పై ఇవాళ కోర్టు విచారణ జరిపింది. తన బదులు జగతి పబ్లికేషన్స్ ప్రతినిధి హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలన్న జగన్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. ఇటీవల సీబీఐ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపును కోర్టు తిరస్కరించగా.. తాజాగా ఈడీ కేసుల్లో దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.

సీఎం అయిన తర్వత జగన్ ఒక్కసారి మాత్రమే కోర్టుకి హాజరయ్యారు. ప్రతి వారం తన హాజరు మినహాయింపు కోరుతూ తన లాయర్ తో పిటిషన్ వేయిస్తున్నారు. దీంతో ఇకపై హాజరు మినహాయింపు కుదరదని, విచారణకు హాజరుకావలసిందేనని తేల్చి చెప్పింది.

Latest Updates