జగన్ ప్రమాణ స్వీకారానికి వేదిక ఖరారు

ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్  రెడ్డి ప్రమాణ స్వీకారానికి వేదిక ఖరారయింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 30న ఉదయం 11.40 గంటలకు జగన్ ప్రమాణం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు మొదలు పెట్టారు.

విజయవాడ నగరంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం. జగన్ ప్రమాణస్వీకారానికి గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, ఇతర రాష్ట్ర నాయకులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోభారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎస్.

Latest Updates