కేసీఆర్ ఔదార్యాన్ని మెచ్చుకోవాలి : AP అసెంబ్లీలో జగన్

ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య డైలాగ్ వార్ నడిచింది. జగన్ వయసు తన రాజకీయ అనుభవం అంత మాత్రమే అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇద్దరు సీఎంలు బాగున్నంతమాత్రాన రాష్ట్రాలు బాగుంటాయా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునే తెలంగాణ ప్రభుత్వంతో తమవైన పాలసీలు ఫాలో అయ్యామన్నారు. జగన్ ఆంధ్ర భవిష్యత్తును ఇబ్బందుల్లోకి నెడుతున్నారని అన్నారు.

రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉంటే.. అభివృద్ధి జరుగుతుందంటూ వివరణ ఇచ్చారు ఏపీ సీఎం జగన్. “కేసీఆర్ ఒకడుగు ముందుకు వేసి… ఔదార్యం చూపించారు. వాళ్ల బౌండరీల నుంచి ఆంధ్రకు నీళ్లివ్వడానికి ముందుకొచ్చారు. గోదావరి నీళ్లను శ్రీశైలంలోకి, నాగార్జున సాగర్ కు తీసుకొస్తే.. కృష్ణా ఆయకట్టు మొత్తం స్థిరీకరణ జరుగుతుందని కేసీఆర్ చెప్పారు. రెండు రాష్ట్రాలకు మంచి జరిగే ఈ నిర్ణయాన్ని ఒప్పందంగా మార్చుకున్నాం. ఈ విషయానికి సంతోషించాల్సిందిపోయి.. చివరకు దాంట్లో కూడా రాజకీయాలు వెతుకుతున్నారంటే ఇంతకంటే దిక్కుమాలిన ప్రతిపక్ష నేత చరిత్ర ప్రపంచంలో ఎవరికీ ఉండదు. ఒప్పందాలు ఉంటాయి కాబట్టి.. ఆంధ్ర ప్రజలకు భవిష్యత్తులోనూ వచ్చే నష్టం ఏమీ ఉండదు” అన్నారు జగన్.

Latest Updates