షాతో జగన్ భేటీ : YCPకి డిప్యూటీ స్పీకర్ పోస్ట్‌పై వార్తలు

ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లిన జగన్… నార్త్ బ్లాక్ లో సాయంత్రం అమిత్ షాను కలిశారు.

అమిత్ షా – జగన్ భేటీ పై పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. వైసీపీకి లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారంటూ వార్తలొచ్చాయి. దీనిపై జగన్ ను మీడియా ప్రతినిధులు వివరాలు అడిగారు. ఐతే… ఈ వార్తల్లో నిజం లేదన్నారు జగన్. అమిత్ షా తమకేమీ ఆఫర్ చేయలేదన్నారు. అమిత్ షాతో సమావేశంలో.. ఏపీ ప్రత్యేక హోదా, ఏపీకి రావాల్సిన నిధులపై మాట్లాడానని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని కఠిన వైఖరి మార్చేలా చూడాలని కోరినట్టుగా చెప్పారు. రేపు శనివారం ప్రధాని నీతిఆయోగ్ సమావేశంలో తమ అసలు డిమాండ్లు వినిపిస్తామన్నారు.

Latest Updates