నేరం చేసిన వారు ఎవరైనా సరే వదలొద్దు

నేరం చేసిన వారేవారు ఎంతటి వారైనా సరే వదిలి పెట్టకుండా చట్టం ముందు నిలబెట్టాలన్నారు. ఏపీ సీఎం జగన్.. ఇవాళ పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా మాట్లాడిన జగన్ .. పిల్లలు, మహిళలకు, వృద్ధుల రక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నారు..ఈ రోజు అమరవీరులను స్మరించుకునే రోజని.. ప్రాణాలు వదిలిన ప్రతి పోలీస్ కుటుంభానికి మన దేశం జేజేలు పలుకుతుందన్నారు. ఏడాదికి 6500 పోలీస్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు.  నేరాల రేటు తగ్గడం కూడా చాలా ముఖ్యమన్నారు. లా అండ్ ఆర్డర్ ప్రభుత్వానికి అతి ముఖ్యమన్నారు. బబడుగు, బలహీన వర్గాల వారిపై దాడిని సహించబోమన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుని చట్టం ముందు నిలబెట్టాలన్నారు. అవతల ఎంత పెద్ద వారు అయినా వదిలొద్దన్నారు. మహిళల భద్రత కోసం దిశ బిల్లు తెచ్చామని..  త్వరలో ఆమోదం పొందుతుంది అని ఆశిస్తున్నానన్నారు.  కరోనా సమయంలో ఏ స్థాయిలో పోలీసులు పని చేశారో అందరికీ తెలుసన్నారు.  టెక్నాలజీ విసిరే సవాళ్లు, కోవిడ్ లాంటి హెల్త్ ఎమర్జెన్సీ లు, ఇసుక, మద్యం అక్రమ రవాణా లాంటివి అడ్డుకోవడానికి పడే కష్టం తెలుసన్నారు.

దేశంలో 76 లక్షలు దాటిన కరోనా కేసులు

 

 

Latest Updates