6 నెలల్లో మంచి సీఎం అనిపించుకుంటా : వైఎస్ జగన్

jagan-says-he-will-get-good-name-with-in-six-months

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి… ఇవాళ సాయంత్రం ప్రజలతో మాట్లాడారు. దేవుడి దయ, జనం ఇచ్చిన చల్లని దీవెనలతోనే తాను ఇవాళ ఈ స్థాయిలో నిలబడగలిగానని అన్నారు. ఈ విజయం తనపై బాధ్యతను, విశ్వాసాన్ని పెంచిందన్నారు. జనం విశ్వసనీయతకు పట్టం కట్టారని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే సరికొత్త రికార్డుతో కొత్త అధ్యాయం నమోదైందని అన్నారు.

జనానికి ఏం కావాలో అది అందిస్తానని.. హామీలు నిలబెట్టుకుంటానని జగన్ అన్నారు. పాలన.. గొప్ప పాలన అంటే ఏంటి అనేది తాను చూపిస్తా అన్నారు. 6 నెలల నుంచి ఏడాది కాలంలోనే తాను మంచి సీఎం ప్రజలతో అనిపించుకుంటా అని జగన్ అన్నారు.

Latest Updates