YCP అఖండ విజయం : మే 30న సీఎంగా జగన్ ప్రమాణం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించింది. 175స్థానాలకు గానూ.. 150కి పైగా సెగ్మెంట్లలో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. తిరుగులేని మెజారిటీ సాధించిన వైఎస్ జగన్.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైపోతున్నారు.

ఈనెల 30వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. మే 25వ తేదీన వైసీపీ శాసన సభాపక్షం సమావేశం కానుంది. ఈ సమావేశంలో జగన్ ను వైసీపీ శాసన సభాపక్ష నేతగా ఎన్నుకుంటారు. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామంటూ గవర్నర్ కు లెటర్ పంపిస్తారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయంతో వైసీపీ శ్రేణుల్లో సంతోషం, సంబురం అంబరాన్నంటుతోంది. ఫలితాలు వెలువడుతున్న సందర్భంగా.. పార్టీ అధినేత జగన్ తమతో పంచుకున్న సంతోషాన్ని ఆ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Latest Updates