జెరూసలేం పర్యటనకు ఏపీ సీఎం YS జగన్

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జెరూసలేం పర్యటనకు వెళ్తున్నారు. రేపు గురువారం హైదరాబాద్ నుంచి ఆయన జెరూసలేం పర్యటనకు వెళ్తారని పార్టీ నాయకులు చెప్పారు.

ఇవాళ మధ్యాహ్నం విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తారు జగన్. ఆ తర్వాత మధ్యాహ్నం 3.30కు బేగంపేటలోని యూఎస్ కాన్సులేట్ ఆఫీస్ కు వెళ్తారు.

ఈ రాత్రి లోటస్ పాండ్ లోని తన ఇంట్లో బస చేస్తారు. రేపు సాయంత్రం హైదరాబాద్ నుంచి జెరూసలేం పర్యటనకు బయల్దేరి వెళ్తారు. తిరిగి ఆగస్ట్ 5 సోమవారం నాడు హైదరాబాద్ వస్తారు.

Latest Updates