14న ఢిల్లీకి AP CM వైఎస్ జగన్

అమ‌రావ‌తి : ఈనెల 14 శుక్రవారం రోజున రాత్రి ఢిల్లీకి వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈనెల 17 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతుండటంతో.. వైసీపీ ఎంపీలతో జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో భేటీ కానున్నారు. జూన్ 15వ తేదీ ఉదయం వైసీపీ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొంటారు జగన్. పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ సమస్యలను ప్రస్తావించే విషయంలో వారికి దిశానిర్దేశం చేస్తారు. ప్రత్యేక హోదా, విభజన నాటి హామీలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై వ్యూహాలు రచించారు వైఎస్ జగన్.

Latest Updates