జగనన్న విద్యా కానుక కార్యక్రమం అక్టోబరు 5కి వాయిదా

ఆంధ్రప్రదేశ్ లో  జగనన్న విద్యా కానుక కార్యక్రమం వాయిదా పడింది. కేంద్రం మార్గదర్శకాలతో ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ఆ రాష్ట్ర పాఠశాల విద్య డైరెక్టర్ తెలిపారు. అక్టోబరు 5న జగనన్న విద్యా కానుక కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. అయితే  సెప్టెంబరు 30 వరకు స్కూళ్లు తెరవరాదని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.దీంతో ఈ నెల 5న చేపట్టాల్సిన జగనన్న విద్యా కానుక నెల రోజులు వాయిదా పడింది.

Latest Updates