డిమాండ్లు నెరవేర్చకపోతే నిరాహార దీక్ష చేస్తా: జగ్గారెడ్డి

కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సీఎం కేసీఆర్ కు  లెటర్ రాశారు. లాక్‌డౌన్ తో పేద, మధ్య తరగతి, వివిధ వర్గాల వారు అనేక ఇబ్బందులు పడుతున్నారని… వాళ్లకు ప్రభుత్వం అండగా ఉండాలని  జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.  దీనికి సంబంధించి పలు డిమాండ్లతో కేసీఆర్ కు లేఖ రాశారు. ఇండస్ట్రీస్ కూడా మూతపడటంతో కార్మికులు, యాజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇలాంటి సమయంలో ప్రభుత్వం అందరిని ఆదుకోవాలని కోరారు. ఈ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకుంటే ఈ నెల 9వ తేదీన తన ఇంట్లో ఒక రోజు నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు.

డిమాండ్లు …

  • … గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంటి పన్నును ఒక సంవత్సరం రద్దు చేయాలి.
    … కరెంట్ బిల్లులు ప్రజల నుంచి ఆరు నెలల వరకు ప్రభుత్వం తీసుకోవద్దు.
    … పట్టణాల్లో కిరాయి ఇంట్లో నివసిస్తున్న కిరాయి దారులకు 6 నెలల వరకు ప్రభుత్వమే కిరాయి చెల్లించాలి.
    … ప్రజలు EMI కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే 6 నెలల EMI కూడా ప్రభుత్వమే చెల్లించాలి.
    …నీటి బిల్లులు ఒక సంవత్సరం వరకు ప్రభుత్వం వసూలు చేయొద్దు.
  • .. ఇండస్ట్రీలకు కూడా 6 నెలల వరకు కరెంట్ బిల్లులు రద్దు చేయాలి.

 

Latest Updates