కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం కాలేదు

హైదరాబాద్: కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం కాలేదన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదని..ఆరోగ్య శ్రీ ఆగిపోయిందన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేవని.. ఉద్యోగాలు లేవన్నారు. 58 ఏళ్లకే పెన్షన్ అన్నాడని.. అది అమలు కావడం లేదన్నారు. మహిళా సంఘాలకు ఋణాలు లేవు. యూనివర్సిటీలో వీసీలు లేరు. ఎస్సీ, ఎస్టీ, సబ్ ప్లాన్ అమలు కావడం లేదన్నారు.

గిరిజనులకు, మైనారిటీ 12%.. రిజ్వేషన్లు అమలు కాలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు. రైతుల సమస్యలు పరిష్కారం కాలేదని..రూ. లక్ష ఋణమాఫీని ఓకే సారి మాఫీ చేయాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టలేదు. ఇచ్చిన హామీలన్నీ కేసీఆర్ నేరవేర్చాలి. రైతులు, మహిళ సంఘాల సమస్యలు, నిరుద్యోగ భృతి, మైనారిటీ SC ST బీసీ సంక్షేమ అభివృద్ధి కోసం పోరాటం చేస్తామని..అన్ని వర్గాల ప్రజల సమస్యలపై సంగారెడ్డిలో జనవరి30న దీక్ష చేస్తానన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్కరోజు దీక్ష చేపడుతానన్నారు.

Latest Updates