ఏడాదిలోగా ఆ పని చేస్తే కేసీఆర్ కు గుడి కట్టిస్తా: జగ్గారెడ్డి

రైతులకు మద్దతు ధర కల్పిస్తానన్న కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అయితే ఏడాదిలోగా పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తే.. కేసీఆర్ కు సంగారెడ్డిలో గుడి కట్టిస్తానన్నారు.

హైదరాబాద్ గాంధీ భవన్ లో మాట్లాడిన జగ్గారెడ్డి… తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కూడా గుడి కట్టిస్తానన్నారు.

రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయడం దారుణమన్నారు. అవినీతి లేని శాఖ ఉంటుందా? అవినీతి చేయని నాయకుడుంటారా? అని జగ్గారెడ్డి అన్నారు. నల్గొండ, ఖమ్మం, మల్కాజ్ గిరి లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు జగ్గారెడ్డి.

Latest Updates