అదే జరిగితే.. 2023 ఎన్నికల్లో పోటీచేయను

19న బాంబే హైవేను బంద్ పెడ్తం
ఆర్టీసీ సడక్‌ బంద్‌కు మద్దతు ప్రకటించిన జగ్గారెడ్డి
ప్రజలంతా కార్మికులకు అండగా నిలవాలని పిలుపు

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన సడక్‌ బంద్‌ను సక్సెస్ చేయాలని కాంగ్రెస్‌ నాయకుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పిలుపునిచ్చా రు. ఈ నెల19న జరిగే సడక్‌ బంద్‌లో భాగంగా బాంబే హైవేను దిగ్బంధం చేస్తామని ఆయన వెల్లడించారు. శనివారం అసెంబ్లీ మీడియా హాల్‌లో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ సమస్య కార్మికులది మాత్రమే కాదన్నారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తే, టికెట్ల ధరలు పెరిగి అంతిమంగా నష్టపోయేది ప్రజలేనన్నారు. ఆర్టీసీ విషయంలో కావాలనే ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు.

పీసీసీ ప్రెసిడెంట్ పదవిస్తే పోటీ చేయను
తనకు పీసీసీ ప్రెసిడెంట్ పదవి ఇస్తే, 2023 ఎన్నికల్లో పోటీ చేయనని జగ్గారెడ్డి చెప్పారు. పార్టీ సూచించిన
వ్యక్తులనే సంగారెడ్డి‌లో పోటీకి నిలబెడతామన్నారు. పదవి కోరుతూ తన బయోడేటాను పార్టీ అధిష్టానానికి ఇప్పటికే రిజిస్టర్ పోస్ట్ చేశానని తెలిపారు. 20వతేదీన నేరుగా ఢిల్లీకి వెళ్లి పార్టీ అధిష్టానం పెద్దలను
కలిసి పదవి ఇవ్వాలని అడుగుతానన్నారు. పార్టీలో ఉన్నప్పుడు పొగిడి, ఇప్పుడు విమర్శించడం సరికాదని
కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన నాయకులకు జగ్గారెడ్డి సూచించారు.

Latest Updates